ఇండియన్‌ ఎంబసీ ఆధ్వర్యంలో 'ఇంటర్నేషనల్‌ యోగా డే'

- June 14, 2019 , by Maagulf
ఇండియన్‌ ఎంబసీ ఆధ్వర్యంలో 'ఇంటర్నేషనల్‌ యోగా డే'

అబుధాబి:జూన్‌ 20వ తేదీన అబుధాబిలోని ఉమ్‌ అల్‌ ఎమరాత్‌ పార్క్‌లో ఐదవ ఇంటర్నేషనల్‌ యోగా డే ఈవెంట్‌ జరగబోతోంది. అబుధాబిలోని ఇండియన్‌ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ టోలరెన్స్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ హాజరు కాబోతున్నారు. గత నాలుగేళ్ళుగా అబుధాబిలో ఇంటర్నేషనల్‌ యోగా డే వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామనీ, ఈ క్రమంలో యూఏఈ అధికార యంత్రాంగం తమకు మంచి మద్దతు ఇస్తోందని ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. కాగా, ఎంబసీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ యోగా వేడుకలు జూన్‌ 28న అల్‌ అయిన్‌లోని జహిల్‌ పార్క్‌లో నిర్వహించనున్నారు. ఉచిత ప్రవేశం పార్కింగ్‌, యోగా మ్యాట్స్‌ మరియు టీ షర్టులు పార్టిసిపెంట్స్‌కి అందజేయబడ్తాయి. కామన్‌ యోగా ప్రోటోకాల్‌ ఫాలో చేస్తారు. యోగా మాస్టర్స్‌ డెమోన్‌స్ట్రేషన్స్‌తోపాటుగా పలు కల్చరల్‌ యాక్టివిటీస్‌ కూడా ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇండియా టూరిజం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, లులు గ్రూప్‌, లులు ఎక్స్‌ఛేంజ్‌, ఎన్‌సి హెల్త్‌కేర్‌, విపిఎస్‌ హెల్త్‌ కేర్‌, యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌, ఇండియన్‌ బిజినెస్‌ మరియు ప్రొఫెషనల్‌ గ్రూప్‌ అబుధాబి సహాయ సహకారాలతో ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వివరాల్ని వెల్లడించేందుకోసం ఇండియన్‌ అంబాసిడర్‌ నవదీప్‌ సూరి, ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఎంబసీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు లభ్యమవుతాయి. రిజిస్ట్రేషన్ కొరకు ఈ  లింక్ http://bit.do/IDY-2019- registration క్లిక్ చెయ్యగలరు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com