సారీ.. తప్పయిపోయింది: యాంకర్ రవి
- June 15, 2019
సందర్భానుసారంగా సెటైర్లు వెయ్యాలి. నొప్పించక తానొవ్వక మాట్లాడాలి. ఇది ఎవరి విషయంలోనైనా వర్తిస్తుంది. కాకపోతే ఓ యాంకర్‌గా టీవీ షో వ్యాఖ్యాతగా ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓ సెలబ్రెటీగా తమని చూస్తున్న ప్రేక్షకులను ఏ మాత్రం ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేయకూడదు. అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతానంటే వారు కూడా బుద్ది చెబుతారు. ఆల్డ్రెడీ ఒక సారి ఇలానే నోరు జారి అడ్డంగా బుక్కయ్యాడు యాంకర్ రవి. తాజాగా మరోసారి. ఆనక ఇప్పుడు క్షమాపణలు కోరుతున్నాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ టీవీ షోలో ఏపీ ప్రజలను కించపరిచే విధంగా ఓ కంటెస్టెంట్ వ్యాఖ్యలు చేయడం.. దానికి యాంకర్ రవి సపోర్ట్ చేయడంతో వివాదం మొదలైంది.
అప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు యాంకర్ రవిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రజలను అవమానించే విధంగా కామెంట్స్ చేస్తే మీరు సపోర్ట్ చేస్తారా అంటూ ఫైర్ అవుతున్నారు. వివాదం ముదరడంతో రవి స్వయంగా రంగంలోకి దిగి.. ఏపీ ప్రజలకు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశాడు. ఆరోజు జరిగింది తప్పే అని.. అయితే యాంకర్‌గా తన స్థానంలో ఎవరున్నా అలాగే చేసే వారని వివరణ ఇచ్చుకున్నాడు. తనకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలన్నా, ముఖ్యమంత్రులన్నా అభిమానమని చెప్పుకొచ్చాడు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరాడు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







