భారత్‌పై విషప్రచారానికి పాక్ అస్త్రం..15 ఎఫ్‌ఎంలు!
- June 15, 2019
కాశ్మీర్‌లో భారత్‌పై విషప్రచారం చేసేందుకు పాక్ భారత సరిహద్దుల్లో ఎఫ్‌ఎం ఛానళ్లను ఏర్పాటు చేసింది. ఈ విషయంపై అప్రమత్తమైన భారత ప్రభుత్వం సరిహద్దుల్లో ఎన్ని ఛానళ్లు చురుగ్గా పనిచేస్తున్నాయో లెక్కలు ఇవ్వమని పేర్కొంది.
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లీ, ముజఫరాబాద్, మిర్‌పూర్‌లలో కొత్తగా ఎఫ్‌ఎం స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇవి ఆర్‌ఎస్‌పురా, రాజౌరి, పూంచ్, నౌషెరా ప్రాంతాల్లో కూడా ప్రసారం అవుతున్నాయి. వీటి ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని విరివిరిగా ప్రచారం చేస్తుంది. ప్రజాదరణ పొందిన పాటలను ప్రసారం చేస్తూ మధ్యలో పాక్ సైన్యానికి అనుకూలంగా ఉండే అంశాలను ప్రస్తావిస్తున్నారని కేంద్ర నిఘా వర్గాలు, సైన్యం చెబుతున్నాయి. వీటిల్లోని కొన్ని రేడియోస్టేషన్లను ఉగ్రసంస్థలు నిర్వహిస్తుండటం గమనార్హం. మొత్తం 15 రేడియో స్టేషన్లు చురుగ్గా పనిచేస్తున్నాయని భారత వర్గాలు గుర్తించాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..