షాప్ బహ్రెయిన్ సందడే సందడి
- January 04, 2016
సెకెండ్ ఎడిషన్ 'షాప్ బహ్రెయిన్' సందర్శకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. 30 రోజులపాటు సాగే ఈ షాప్ బహ్రెయిన్ డిసెంబర్ 24 నుంచి జనవరి 23 వరకు జరగనుంది. అలాగే, అల్ రివాక్ ఆర్ట్ స్పేస్ మరియు ఇతర రెస్టారెంట్లు షాప్ బహ్రెయిన్‌తో కలిసి సంయుక్తంగా వినియోగదారులకు అమితానందాన్ని ఇవ్వనున్నాయి. అల్ రివాక్‌కి చెందిన 'ది నెస్ట్' తమ ్పఓడక్ట్స్ ఈ సందర్భంగా డిస్‌ప్లేలో ఉంచనుంది. 10 డిసెంబర్ నుంచి 9 జనవరి వరకు వారాంతంలో జరిగే స్పెషల్ ఈవెంట్స్‌లో భాగంగా 'ద టేస్ట్ టూర్' నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌లో వివిధ రెస్టారెంట్లు వినియోగదారులకు విభిన్నమైన రుచులను పరిచయం చేయనున్నాయి. చివరి రోజున నిర్వహించే డ్రాలో గెలుపొందేవారికి గల్ఫ్ ఎయిర్ నుంచి బిజినెస్ క్లాస్ టిక్కెట్లు గెలుచుకునే అవకాశం ఉంది. షాప్ బహ్రెయిన్ దగ్గరకొస్తే, ఇప్పుడు జరుగుతున్నది రెండో ఎడిషన్. కింగ్‌డమ్‌కి సంబంధించి సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. గత సంవత్సరం బహ్రెయిన్ షాపింగ్ పెస్టివల్‌ని 'బహ్రెయిన్ నూర్ ఎల్ అయిన్' పేరుతో నిర్వహించారు. బహ్రెయిన్ హాస్పిటాలిటీ, టూరిజం, రిటైల్ బిజినెస్, పలు రకాల ఈవెంట్స్, యాక్టివిటీస్‌తో షాపింగ్ చేయాలనుకునేవారికి మధురానుభూతులను అందిస్తోంది ఈ షాపింగ్ ఫెస్టివల్.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







