ట్రాఫిక్ ఉల్లంఘనలు ఇక్కడే అధికం
- January 04, 2016
షార్జాలోని అల్ ఒరోబా, బుహారియా కోర్నిచె, జమాల్ అబ్దుల్ నాజర్ మరియు అల్ వాహ్దా స్ట్రీట్స్‌లో వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఎక్కువగా పాల్పడుతున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. షార్జాలో గత ఏడాది మొత్తం 13,691 మంది మోటరిస్టులకు ఫైన్ విధించారు. వీరంతా మొబైల్ ఫోన్లు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్ని నడిపినట్లు పోలీసు అధికారులు చెప్పారు. షార్జాలో 200,000 కార్లు రిజిస్టర్ అయి ఉన్నాయనీ, యాక్సిడెంట్లు ముఖ్యంగా రోడ్లపై నడుస్తున్నవారిని ఢీ క్టొడం ద్వారా నెలకు 8 నుంచి 10 మంది మృత్యువాత పడ్తున్నట్లు చెప్పారు. సార్జా అల్ ధాయిద్ మలిహా, షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ రోడ్, ఎమిరేట్స్ రోడ్లలో ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. 18 నుంచి 26 ఏళ్ళ మధ్య వయస్కులు ఎక్కువగా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. యాక్సిడెంట్లలో 60 శాతం వరకు ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నాయి. ఆరు ప్రధాన కూడళ్ళ వద్ద 24 రాడార్లను ఏర్పాటు చేయాలని, తద్వారా రెడ్ సిగ్నల్ జంప్ చేసేవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని పోలీసు వర్గాలు చెప్పాయి. మొబైల్ ఫోన్ వాడుతూ, వాహనాలు నడుపుతున్నవారికి నాలు బ్లాక్ పాయింట్స్‌తోపాటు, 200 దిర్హామ్‌ల ఫైన్ విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







