ఎమిరేట్స్ రోడ్డుపై మూడు రాడార్ల ఏర్పాటు
- June 18, 2019
ఎమిరేట్స్ రోడ్డుపై మూడు కొత్త రాడార్లను ఏర్పాటు చేశారు. అతి వేగంతో ప్రయాణించే వాహనాల్ని గుర్తించడంతోపాటు, వాహనదారుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. షమాల్ అల్ రామ్‌స మీదుగా వెళ్ళే రోడ్డుపై వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. రస్ అల్ ఖైమా పోలీస్ - సెంట్రల్ ఆపరేషన్స్ రూమ్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది మాట్లాడుతూ, కొత్త రోడ్డుపై స్పీడ్ లిమిట్‌ని గంటకు 141 కిలోమీటర్లుగా నిర్ణయించినట్లు చెప్పారు. ఆర్టియల్ రోడ్డుపై మరిన్ని స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. ఇదిలా వుంటే, ఎమిరేట్స్ రోడ్డుపై గంటకు 264 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్ళిన కారుని స్పీడ్ కెమెరాలతో గుర్తించిన అధికారులు, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. రస్ అల్ ఖైమాలో జరుగుతున్న చాలా ప్రమాదాల్లో 85 శాతం అతి వేగం కారణంగా జరుగుతున్నవేనని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







