శేఖర్ కమ్ముల సినిమాలో నటించనున్న నాగ చైతన్య
- June 21, 2019
సెన్సిబుల్ ప్రేమ కథా చిత్రాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆయన తీసే ప్రతీ సినిమాలో ఆ సెన్సిటివ్ నెస్ తో కూడిన ప్రేమ కథ ఉంటుంది. ప్రేమ కథా చిత్రాలను తీయడంలో ఈయనది డిఫరెంట్ స్టైల్. ఆనంద్ సినిమా దగ్గర్నుండి మొన్న వచ్చిన ఫిదా వరకు ఆయన స్టైల్ అంతే. ప్రేక్షకులని కట్టి పడేస్తుంటారు. ఫిదా సినిమా తర్వాత ఆయన దగ్గర నుండి తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు.
ఈ మధ్య ఒక వార్త బయటకు వచ్చింది. " మజిలీ " చిత్రంతో హిట్ తో జోరు మీదున్న నాగచైతన్య తో తన తర్వాతి సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య కి ప్రేమ కథా చిత్రాలు బాగా కలిసొస్తున్నాయి. "ఏ మాయ చేసావె, మజిలీ "రెండు చిత్రాలు నాగచైతన్య కెరీర్ లో మర్చిపోలేని చిత్రాలుగా నిలిచాయి. ఈ రెండు చిత్రాల్లో సమంత ఉండడం విశేషం.
చైతూ హీరోగా శేఖర్ కమ్ముల ఒక సినిమా చేయనున్నాడనీ, కథానాయికగా సాయిపల్లవి ఎంపిక జరిగిపోయిందనే టాక్ రెండు మూడు రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్త నిజమేననే విషయం తాజాగా స్పష్టమైపోయింది. శేఖర్ కమ్ముల - చైతూ కాంబినేషన్ లోని సినిమా నిజమేనంటూ ఒక ప్రకటన వచ్చేసింది. నాయికగా సాయిపల్లవినే ఖరారు చేసేశారు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగును సెప్టెంబర్ మొదటివారంలో మొదలెట్టనున్నారు. డిసెంబర్లో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం చైతూ 'వెంకీమామ' సినిమా చేస్తున్నాడు. అలాగే శేఖర్ కమ్ముల కూడా కొత్త ఆర్టిస్టులతో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాత, శేఖర్ కమ్ముల - చైతూ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని అంటున్నారు. 'ఫిదా' తరువాత శేఖర్ కమ్ములతో సాయిపల్లవి చేస్తోన్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి పెరిగిపోతోంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







