మెదడు వాపు వ్యాధితో చనిపోతున్న చిన్నారులు
- June 25, 2019
బీహార్‌లోని ముజఫర్‌ఫర్‌పూర్ జిల్లాలో మెదడు వాపు వ్యాధితో వందలాదిమంది చిన్నారులు చనిపోతున్నారు. ఇప్పటికే 117కి పైగా చిన్నారులు చనిపోయారు. చిన్నారుల ప్రాణాల్ని ప్రభుత్వం కాపాడలేకపోతోంది, అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవడంలేదంటూ బీహార్‌కు చెందిన అజ్మానీ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. సీఎం నితీష్ కుమార్‌కు అక్షింతలు వేసింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం…. బీహార్‌తో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది..
పిల్లల మరణాలకు సంబంధించిన పూర్తి వివరాలను సుప్రీం కోర్టుకు అందించాలని బీహార్‌ను అదేశించింది. వ్యాధిని ఎదుర్కొనేందుకు నితీష్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో అఫిడవిట్ ఇవ్వాలని ఆదేశించింది. అటు సీఎం నితీష్ కుమార్ మాత్రం.. చిన్నారుల మరణాలపై సరిగా స్పందించడం లేదు. మీడియా ప్రశ్నించినా సీరియస్ అవుతున్నారు. మృతుల కుటుంబాలకు కేవలం 4 లక్షల రుపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి కొనసాగడానికి వీల్లేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూతూ మంత్రపు చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం కావాలని సూచించింది. విచారణను 10 రోజులపాటు వాయిదా వేసింది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







