హెచ్‌సీఎల్‌లో 3000ల ఉద్యోగాలు..
- June 27, 2019
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్స్‌ని ఉద్యోగాల్లోకి తీసుకోనుంది. నోయిడా క్యాంపస్ కోసం 3వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఇందులో 2,000 ఉద్యోగాలను తాజాగా ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తున్నారు. మరో 1,000 ఉద్యోగాల కోసం మ్యాథ్స్‌తో ఇంటర్ పాసైన విద్యార్థులను, ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వీరికి సంవత్సరం పాటు ఐటీ పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి, ఆ తర్వాత కంపెనీలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా తెలిపారు. అనుబంధ కంపెనీ హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాపింగ్ సర్వీసెస్ ద్వారా వీరికి శిక్షణ ఇప్పిస్తారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన అభ్యర్థులను కోరారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







