డ్రోన్ కెమెరాల నిషేదం
- January 04, 2016
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల నిషేదం పోలీసు కమిషనర్ సీరియస్‌గా ఉన్నారు. తాజాగా ఈ కెమెరాల నిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండా చాలా ఈ వెంట్స్, వివాహాలు, పలు ఫంక్షన్స్ల్లో వీటిని ఎగురవేస్తూ ఫొటోలు తీస్తున్నట్లు సమాచారం అందింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో అనుమతి లేని ఈ డ్రోన్ కెమెరాలను ఎగురవేయడం విమాన రాకపోకలతో పాటు ఇతర అంశాల్లో కూడా ఇవి పెద్ద ప్రమాదాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర విమానయాన శాఖ 2014 అక్టోబరు నుంచి వీటి ఎగరాడాన్ని నిషేదించింది.అదే విధంగా వీటికి సంబంధించిన అనుమతులను జారీ చేసేందుకు డీజీసీఏ పలు అంశాలపై ఆధ్యయనం చేస్తుంది. డీజీసీఏ నుంచి తాజా ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేటు వ్యక్తులు వీటిని ఎగురవేయడం పూర్తి నిబంధనలకు విరుద్ధమని సీపీ నోటిఫికేషన్లో వివరించారు. విమానాయన శాఖ,పోలీసుల నుంచి అనుమతులు ఉంటేనే డ్రోన్ కెమెరాలు ఎగురవేయాలని సీపీ స్పష్టం చేశారు. ఈ డ్రోన్ కెమెరాల వ్యవహారంలో అనుమతులు లేకుండా ఎవరైనా ఎగురవేస్తా స్థానిక పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ బాధ్యులుగా పరిగణీస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









