అనగనగా ఒక సుదూర గాలక్సీ లో...

- January 04, 2016 , by Maagulf

న్యూ ఇయర్ డే నాడు స్టార్ వార్స్ ది ఫోర్సు అవేకన్స్..చూసాను.చూడక పోతే ఎలా. ఐ యాం అ ఫ్యాన్ ,కాని ఇదివరకు ఈ సినిమాల త్రయం చూడని వారికి ఏమీ అర్ధం కాదు,ఎలా చూస్తారు 1980 ల లో వచ్చాయి వాటికి మళ్ళీ జార్జ్ లుకాస్ ప్రేక్వేల్స్ 3 తీసాడు .ప్రచారం చర్చలు ఫ్యాన్ల వ్యాసాలు సమీక్షల తో వాళ్ళు ఈ స్పేస్ ఒపేరా అనే రొమాంటిక్ సైన్స్ ఫిక్షన్ ని చాలా కాలం ప్రచారం చేసి అద్భుత విజయం సాధించారు .జార్జ్ లుకాస్ దగ్గర డిస్నీ వాళ్ళు కొనుక్కుని ఇప్పుడు మళ్ళీ తిరిగి సిరీస్ మొదలు పెట్టారు.ఈసినిమా మాములుగా మొదటి న్యూ హోప్ సినిమా లాగా ఉంది.30 ఏళ్ళ తరవాత వచ్చిన ఆధునికత లేదు .ఈ స్టొరీ లుకాస్ రాయలేదు ఆయనకీ నచ్చ లేదట కూడా.ఆయన హక్కులు అమ్మేసుకున్నాడు మరి.అయినా నాకు అన్ని పాత్రలు ఇష్టం.హ్యంస్ సోలో అయ్యో ముసలి వాడయి పోయి చని పోయాడు .ఆయన కొడుకు మళ్లీ చీకటి రాజ్యం వైపు వెళ్ళిపోయాడు రాజకుమారి లియా ముసలి అయిపొయింది.కొత్త రాజకుమారి కి సాయం గా ఫిన్ అనే నల్ల జాతీయుడు వచ్చాడు..చుయీ అనే వానరం అలాగే అరుస్తోంది.సుప్రీమ్ మాస్టర్ బాగా ముసలి ముడతల మొహం తో హన్స్ సోలో కొడుకుని డార్క్ ఫోర్సు వైపు తిప్పుకుని పనిచేయిస్తున్నాడు .మళ్ళీ రక్త సంభందాలు మంచి చెడుల వైపు ఇరుక్కున్నాయి.మిలీనియం ఫాల్కన్ కాంతి వేగం తో..పాతబడి తుప్పు పట్టిన షిప్ లాగా వుంది. .ల్యూక్ ది స్కై వాకర్ మాత్రం సినిమా చివర లో గడ్డం పెరిగిపోయి కనిపించాడు .ఆయన దగ్గరకి లైట్ సాబార్ తీసుకుని వెళ్లి ఇచ్చింది అమ్మాయి .పాత కథే కొత్త సంవత్సరం లో .సింప్లిసిటీ నే ప్రేక్షకుల కి నచ్చుతుంది. కాని హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ ఇష్టపడే వాళ్ళకి ఇది నచ్చదు మరి. ఫాన్స్ కి మాత్రం కావలసినంత చర్చ కి మేత.మే ది ఫోర్సు బి విత్ యు !

 

--డా.చిత్తర్వు మధు 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com