డ్రోన్ కెమెరాల నిషేదం

- January 04, 2016 , by Maagulf
డ్రోన్ కెమెరాల నిషేదం

 సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రోన్ కెమెరాల నిషేదం పోలీసు కమిషనర్ సీరియస్‌గా ఉన్నారు. తాజాగా ఈ కెమెరాల నిషేధానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. పోలీసు కమిషనరేట్ పరిధిలో కొంత మంది ఎలాంటి అనుమతులు లేకుండా చాలా ఈ వెంట్స్, వివాహాలు, పలు ఫంక్షన్స్‌ల్లో వీటిని ఎగురవేస్తూ ఫొటోలు తీస్తున్నట్లు సమాచారం అందింది. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో అనుమతి లేని ఈ డ్రోన్ కెమెరాలను ఎగురవేయడం విమాన రాకపోకలతో పాటు ఇతర అంశాల్లో కూడా ఇవి పెద్ద ప్రమాదాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర విమానయాన శాఖ 2014 అక్టోబరు నుంచి వీటి ఎగరాడాన్ని నిషేదించింది.అదే విధంగా వీటికి సంబంధించిన అనుమతులను జారీ చేసేందుకు డీజీసీఏ పలు అంశాలపై ఆధ్యయనం చేస్తుంది. డీజీసీఏ నుంచి తాజా ఉత్తర్వులు వచ్చే వరకు ప్రైవేటు వ్యక్తులు వీటిని ఎగురవేయడం పూర్తి నిబంధనలకు విరుద్ధమని సీపీ నోటిఫికేషన్‌లో వివరించారు. విమానాయన శాఖ,పోలీసుల నుంచి అనుమతులు ఉంటేనే డ్రోన్ కెమెరాలు ఎగురవేయాలని సీపీ స్పష్టం చేశారు. ఈ డ్రోన్ కెమెరాల వ్యవహారంలో అనుమతులు లేకుండా ఎవరైనా ఎగురవేస్తా స్థానిక పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ బాధ్యులుగా పరిగణీస్తామని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com