తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ హైకమాండ్
- July 01, 2019
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా.. తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్లోని పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేసే అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. వీటిపై అమిత్‌షాకు నివేదిక అందించారు కొందరు బీజేపీ నేతలు. ఈ రిపోర్టులను పరిశీలించిన అమిత్‌షా….. పార్టీ సభ్యత్వ నమోదును ఎలా చేయాలో వారికి వివరించినట్లు తెలుస్తోంది. సంస్థాగతంగా పార్టీ పటిష్ఠతపైనే ముఖ్యంగా చర్చించనట్లు తెలుస్తోంది.
ప్రధానంగా తెలంగాణపైనే ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ హైకమాండ్. అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో కలిసి తెలంగాణ బీజేపీ ముఖ్య నేతల కోర్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఇందులో మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నిలపై చర్చించారు. అలాగే బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఇందులో చర్చించారు. సమావేశంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు, రాజా సింగ్, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఈనెల 6 నుంచి దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వకార్యక్రమాన్ని శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా,….శంషాబాద్‌లో సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పార్టీలో చేరిన ప్రముఖనేతలతో పాటు పార్టీ నేతల గురించి అడిగి తెలుసుకున్నారు అమిత్‌షా. అనంతరం బెంగాల్ నేతలతోనూ, చివరికి ఒడిశా నేతలతో సమావేశమయ్యారు అమిత్‌షా.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







