యూఏఈ:కారులో చిన్నారిని ఒంటరిగా వదిలితే 1 మిలియన్ జరీమానా, 10 ఏళ్ళ జైలు
- July 01, 2019
యూఏఈ:కారులో చిన్నారిని వదిలివేయడం ద్వారా ఆ చిన్నారినికి ఎలాంటి అపాయం జరిగినా, అనారోగ్య సమస్యలు తలెత్తినా, దానికి కారకులైనవారికి 1 మిలియన్ వరకూ జరీమానా, 10 ఏళ్ళ జైలు శిక్ష విధించే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు. యూఏఈ చైల్డ్ రైట్స్ చట్టం - వదీమా చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు స్పష&ం చేశారు. గత నెలలో ఈ తరహా ఘటనలు చాలాచోటు చేసుకున్న దరిమిలా, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. పిల్లలు చాలా త్వరగా సఫోకేట్ అవుతారనీ, ఎండ సమయాల్లో కారు ఇంజన్‌ని ఆపకుండా వెళ్ళినా, ఆపేసి వెళ్ళినా ప్రమాదకరమేనని అధికారులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఉల్లంఘనులకు హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..