అమెరికా:రేపటి నుండి వలసవాసులపై దాడులు..

- July 03, 2019 , by Maagulf
అమెరికా:రేపటి నుండి వలసవాసులపై దాడులు..

వాషింగ్టన్‌:ఈ నెల 4వ తేదీ తరువాత తమ దేశంలో వున్న అక్రమ వలసవాసు లందరిపై దాడులు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జులై 4 తరువాత తమ దేశంలో చట్టవిరుద్ధంగా వుంటున్న వారందరినీ వెనక్కి పంపే కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సెంట్రల్‌ అమెరికా నుండి వచ్చే అక్రమ వలస వాసులను వెనక్కి పంపేందుకు, సరిహద్దుల నిర్వహణకు అవసరమైన 460 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపు బిల్లును ఆయన ఆమో దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అక్రమ వలసల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ పార్టీల నేతలు కలిసి కృషి చేస్తారన్న ఉద్దేశంతో తాము ఈ దాడులను రెండు వారాల పాటు వాయిదా వేశామని చెప్పారు. ఈ రెండు వారాల గడువు నాలుగవ తేదీతో ముగుస్తున్నప్పటికీ ఇరుపార్టీల నేతల నుండి ఇప్పటి వరకూ తగిన స్పందన రాలేదని ఆయన చెప్పారు. ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసిఇ) విభాగం రూపొందిం చిన ప్రణాళిక ప్రకారం దేశంలోని లాస్‌ఏంజెల్స్‌, హోస్టన్‌, చికాగో, మియామీ, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర పది నగరాల్లో అక్ర మంగా నివశిస్తున్న దాదాపు 2 వేల కుటుంబా లకు చెందిన వారిని వెనక్కి పంపనున్నట్లు తెలుస్తోంది. ట్రంప్‌ సర్కారు చేపట్టిన ఈ చర్య అనేక కుటుంబాలను విడదీస్తుందన్న ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో తాము ఇందుకు సహకరించబోమని చికాగో, లాస్‌ఏంజెల్స్‌ నగర మేయర్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com