'స్పైస్ జెట్' ఎయిర్లైన్స్ వారి కొత్త ఆఫర్
- July 03, 2019
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్..వర్షాకాల ఆఫర్‌ను ప్రకటించింది. ఈ నెల 6 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్ కింద దేశీయంగా ప్రారంభ విమాన టిక్కెట్టు ధరను రూ.888గా నిర్ణయించింది. పరిమిత కాల ఆఫర్‌లో బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు ఈ ఏడాది సెప్టెంబర్ 25 లోగా ప్రయాణించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. పరిమిత సీట్లు కలిగిన ఈ ఆఫర్ కింద ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే లభించనున్నట్లు ఒక ప్రకటనలో సంస్థ తెలిపింది. అంతర్జాతీయ రూట్లలో కూడా వర్తించనున్న ఈ ఆఫర్ కింద ప్రారంభ విమాన టిక్కెట్టును రూ.3,499కి విక్రయిస్తున్నది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







