3 రోజుల ఇండియా పర్యటనలో యూఏఈ ఫారిన్‌ మినిస్టర్‌

- July 05, 2019 , by Maagulf
3 రోజుల ఇండియా పర్యటనలో యూఏఈ ఫారిన్‌ మినిస్టర్‌

యూఏఈ మినిస్టర్‌ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, మూడు రోజుల భారత పర్యటనను జులై 7 నుంచి ప్రారంభించనున్నారు. పరస్పర సహకారానికి సంబంధించి ఇంకా మరింత మెరుగైన ఆలోచనల్ని ఈ సందర్భంగా ఇరు దేశాలూ పంచుకోనున్నాయి. నహ్యాన్‌ వెంట సీనియర్‌ లెవల్‌ డెలిగేషన్‌ వుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే విదేశాంగ మంత్రి ఎస్‌ జయశంకర్‌తో ఈ టూర్‌ సందర్భంగా నహ్యాన్‌ చర్చలు జరుపుతారు. యూఏఈ - భారత్‌ మధ్య ఎన్నో ఏళ్ళుగా స్నేహ సంబంధాలున్నాయి. యూఏఈ, ఇండియాకి మూడవ అతి పెద్ద ట్రేడ్‌ పార్టనర్‌ అలాగే, నాలుగవ అతి పెద్ద ఎనర్జీ సప్లయర్‌. ఇండియా యొక్క స్ట్రేటజిక్‌ పెట్రోలియం రిజర్వ్స్‌కి సంబంధించి యూఏఈ తొలి భాగస్వామి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com