అమెరికా కాన్సులేట్ అధికారులతో భేటీ అయిన కేటీఆర్
- January 05, 2016
అమెరికా దౌత్యకార్యాలయం(కాన్సులేట్) అధికారులతో తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం భేటీ అయ్యారు. ఇటీవల అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి ప్రభుత్వం తిప్పిపంపిన అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. వీసాలు ఇచ్చేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలని కాన్సులేటు అధికారులను ఆయన ఈ సందర్భంగా కోరినట్టు తెలిసింది.
దాంతో సమస్య వచ్చిన మాట వాస్తవమేనని కాన్సులేట్ అధికారులు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఒక హైదరాబాద్ విద్యార్థులకే సమస్య రాలేదని.. వారికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను కోరినట్టు కేటీఆర్ చెప్పారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కాన్సులేట్ అధికారులు హామీ ఇచ్చినట్టు తెలిపారు. కాగా, విద్యార్థుల సమస్యలపై విదేశాంగ శాఖకు లేఖ రాస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







