ఢిల్లీ లో రేడియో జాకీ అరెస్ట్
- July 06, 2019
ఢిల్లీ:ఓ రేడియో జాకీ డ్రైవింగ్ అలసత్వం కారణంగా లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది. దీంతో రేడియో జాకీ అంకిత్ గులాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై హిట్ అండ్ రన్ కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపై కారును వేగంగా నడుపుతూ ఎల్‌జేపీ కార్యకర్త ధీరజ్ కుమార్ బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు అవడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గత ఆదివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం తర్వాత అంకిత్ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతని కోసం గాలించిన పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. అంకిత్ గులాటి.. రేడియో సిటీలో ఆర్‌జేగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై డిల్లీ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..