ఉమ్ అల్ కువైన్లో రోడ్డు ప్రమాదం
- July 08, 2019
ఎమిరేటీ యువతి ఒకరు తన వాహనాన్ని నడుపుతూ అదుపు కోల్పోవడంతో వాహనం ఓ షాప్‌లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఆస్తి నష్టం సంభవించింది. విచారణలో వాహనాన్ని నడుపుతున్న యువతి, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినట్లు గుర్తించారు అధికారులు. బ్రేయ్ వేయాల్సిన సమయంలో ఆమె గ్యాస్ పెడల్‌ని ప్రెస్ చేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. సదరు యువతి వయసు 20 ఏళ్ళు అనీ, ఆమెకు ఈ ప్రమాదంలో ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. వాహనదారులు వాహనాల్ని నడిపే సమయంలో అప్రమత్తంగా వుండాలనీ, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని పోలీసు అధికారులు వాహనదారుల్ని హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







