ఎమిరేట్స్‌ ఐడీనే హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కార్డ్‌

- January 05, 2016 , by Maagulf
ఎమిరేట్స్‌ ఐడీనే హెల్త్‌ ఇన్స్యూరెన్స్‌ కార్డ్‌

యూఏఈ నివాసితులు ఇక నుంచి ఎమిరేట్స్‌ ఐడీ కార్డులతో ఇన్స్యూరెన్స్‌ ఔకర్యాలను దుబాయ్‌లోని హెల్త్‌ కేర్‌ సెంటర్స్‌ ద్వారా పొందవచ్చు. దుబాయ్‌ హెల్త్‌ అథారిటీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ కార్డుల్ని ఎమిరేట్స్‌ ఐడీ కార్డులతో రీప్లేస్‌ చేయనున్నారట. యూఏఈలో ప్రతి ఒక్కరికీ మెడికల్‌ ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం కల్పించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు డిహెచ్‌ఎ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ ఫండింగ్‌ డాక్టర్‌ హైదర్‌ అల్‌ యూసఫ్‌ చెప్పారు. ప్రస్తుతానికి యూఏసీ జాతీయులు సాదా ఇన్స్యూరెన్స్‌ మరియు నివాసితులు (వలసదారులతో కలిపి) ఇనాయా ఇన్స్యూరెన్స్‌ ప్లాన్‌ కలిగి ఉన్నవారు జనవరి 1 నుంచి కొత్త విధానంలోకి చేరతారు. సాదా మరియు ఇనాయా ఇన్స్యూరెన్స్‌ సౌకర్యం ఉన్నవారి అక్కౌంట్లు ఎమిరేట్స్‌ ఐడీకి లింక్‌ చేయబడతాయి. మిగతా అన్ని ఇన్స్యూరెన్స్‌ అకౌంట్లనూ ఎమిరేట్స్‌ ఐడీ కార్డ్‌కి లింక్‌ చేసే బృహత్‌ కార్యక్రమం 2016 తొలి క్వార్టర్‌లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com