15వ దలైలామాగా పుట్టపర్తి స్కూలు విద్యార్థి..
- July 09, 2019
తన వారసుడు భారత్‌లోనే ఉన్నాడని 14వ దలైలామా గత మార్చిలో వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్టుగానే అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి స్కూల్లో చదివే విద్యార్థి 15వ దలైలామాగా ఎంపికయ్యాడు. 7వ తరగతి చదువుతున్న దావావంగ్డిని పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్‌కు చెందిన వాడు. తల్లిదండ్రులు ప్రేమవంగ్డి, పంజూరాయ్. ప్రస్తుత 14వ బౌద్ధగురువు దలైలామా దావావంగ్డిని వివిధ కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించి అతడిని ఎంపిక చేశారు. బాలుని తల్లిదండ్రులను ఒప్పించిన బౌద్ద గురువులు అతడిని తమతో పాటు తీసుకువెళ్లారు. మైసూరు సమీపంలోని బైలుగుప్పే (గోల్డెన్ టెంపుల్) బౌద్ధారామంలో 15 సంవత్సరాలు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక వంగ్డి దలైలామాగా బాధ్యతలు స్వీకరిస్తారు. తనను సాయిరాం అని పిలిస్తే పలుకుతానని వంగ్డీ స్నేహితులకు చెప్పి వీడ్కోలు తీసుకున్నాడు. దలైలామా అస్తమించిన తరువాత కూడా తిరిగి అంతకుముందున్న వారి ఆత్మలో ప్రవేశిస్తారని బౌద్ధుల నమ్మకం. కాగా, 15వ దలైలామా భారత్‌లో పుడతారని 14వ దలైలామా చెప్పిన వ్యాఖ్యలను చైనా తప్పుపడుతోంది. భారతీయులను కాకుండా వేరేవారిని నియమించాలనేది చైనా అభిప్రాయం. అయితే ఇప్పుడు నియమించిన 15వ దలైలామా దావావంగ్డి నియామకాన్ని చైనా ప్రభుత్వం అంగీకరించిందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







