జమ్‌జమ్ బ్యాన్‌పై ఎయిర్ ఇండియా క్షమాపణ
- July 09, 2019
యూఏఈ: జమ్‌జమ్ హోలీ వాటర్ విషయమై ఎయిర్ ఇండియా, ప్రయాణీకులకు క్షమాపణ చెప్పింది. పవిత్ర జలంగా భావించే జమ్‌జమ్ వాటర్‌ని ఎయిర్ ఇండియా విమానాల్లో నిషేధించడం వివాదాస్పదమయ్యింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ట్విట్టర్ వేదికగా క్షమాపణ చెప్పింది. ఇకపై ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జమ్‌జమ్ వాటర్‌ని ప్రయాణీకులు తీసుకెళ్ళవచ్చునని పేర్కొంది. తమకు కేటయించబడిన బ్యాగేజ్ పరిమితిలో జమ్‌జమ్ వాటర్‌ని కూడా తీసుకెళ్ళేందుకు అనుమతిస్తున్నామనీ, ఎక్కడైనా ఎలాంటి ఇబ్బందులైనా తలెత్తితే ప్రయాణీకులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపింది ఎయిర్ ఇండియా. కాగా, జమ్‌జమ్ వాటర్ బ్యాన్‌పై భారత వలసదారులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, జెడ్డా నుంచి ఇండియాకి డైరెక్ట్‌గా పవిత్ర జలాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసి, ఇక్కడ ఫిలిగ్రిమ్స్‌కి ప్రత్యేకంగా అందించాలనే ప్రతిపాదన 2014లోనే వచ్చిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే, అది అమల్లో వుందో లేదో మాత్రం చెప్పలేదు. తమ బంధువులకు పవిత్ర జలాన్ని ఇవ్వడం మక్కా వెళ్ళి వచ్చే ప్రయాణీకులకు ఆనవాయితీ.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







