ఏకకాలంలో 110 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
- July 09, 2019
అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది సీబీఐ. మంగళవారం ఏకకాలంలో 110 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి హడలెత్తించింది. 30 కేసులకు సంబంధించి 19 రాష్ట్రాల్లో.. 110 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ప్రధానంగా అవినీతి, ఆయుధాల స్మగ్లింగ్ ఆరోపణలపై విసృతంగా గాలించాయి.
సీబీఐ దాడులతో నేర ప్రవృత్తి కలిగిన వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. పక్కా ప్రణాళికతో ఏకకాలంలో 110 చోట్ల దాడులు చేయడంతో బిత్తరపోయారు. ఢిల్లీ, ముంబై, లుథియానా, థానే, వాల్సాడ్, పుణె, పలానీ, గయా, గుర్గావ్, చండీగఢ్, భోపాల్, సూరత్, కోలార్ ఇతర చోట్ల దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు.
మొత్తం 16 కేసుల్లో మోసపూరిత సొమ్ము రూ.1100 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుల్లో వివిధ కంపెనీలు, సంస్థలు, ప్రమోటర్లు, డైరెక్టర్లు, బ్యాంకు అధికారులు, ఇతరులు ఉన్నారని పేర్కొన్నారు. బ్యాంకులకు రూ.13 వేలకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో నక్కిన నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ ఉదంతం.. కేంద్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. దీంతో మిగతా ఆర్థిక నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని దాడులు చేయిస్తున్నట్టు విశ్వసనీయం సమాచారం.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







