షార్జాలో తొలి యూఏఈ పర్మనెంట్‌ రెసిడెన్సీ గోల్డ్‌ కార్డ్‌ పొందిన ఇండియన్‌

- July 10, 2019 , by Maagulf
షార్జాలో తొలి యూఏఈ పర్మనెంట్‌ రెసిడెన్సీ గోల్డ్‌ కార్డ్‌ పొందిన ఇండియన్‌

కింగ్‌స్టన్‌ హోల్డింగ్స్‌ డైరెక్టర్‌, షార్జా ఇండస్ట్రీ బిజినెస్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ లాలు సామ్యూల్‌ షార్జాలో మొట్టమొదటి యూఏఈ పర్మనెంట్‌ రెసిడెన్సీ గోల్డ్‌ కార్డ్‌ దక్కించుకున్న వ్యక్తిగా రికార్డులకెక్కారు. జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెసిడెన్సీ అండ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ - షార్జా ఈ గోల్డెన్‌ కార్డ్‌ని జారీ చేసింది. క్యాబినెట్‌ డెసిషన్‌ నెంబర్‌ 56, 2018 ప్రకారం ఈ కార్డుల జారీ జరుగుతోంది. ఇన్వెస్టర్స్‌, ఎంటర్‌ప్రెన్యూసర్స్‌, టాలెంటెడ్‌ పీపుల్స్‌కి (ఎంపిక చేసినవారికి మాత్రమే) ఈ కార్డులు లభిస్తున్నాయి. ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ పోర్ట్స్‌ షార్జా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ అల్‌ షామ్సి గోల్డెన్‌ కార్డుని లాలు సామ్యూల్‌కి అందించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com