బాలీవుడ్‌కు ‘ఓ బేబీ’!
- July 10, 2019
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కొరియన్ మూవీ మిస్‌గ్రానీకి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పిస్తోంది. దీంతో ఓ బేబీని రీమేక్ చేసేందుకు బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
తెలుగులో ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించిన సురేష్ ప్రొడక్షన్స్ బాలీవుడ్ రీమేక్‌ను నిర్మించే ఆలోచనలో ఉన్నారట. బాలీవుడ్ నిర్మాణ బాధ్యతలు పర్యవేక్షించటంతో పాటు ఓ కీలక పాత్రలో నటించేందుకు రానా సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సమంత పాత్రకు కంగనా లేదా అలియా భట్‌ల పేర్లను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగులో నందిని రెడ్డి దర్శకత్వం వహించగా రావూ రమేష్, రాజేంద్రప్రసాద్, లక్ష్మీ, తేజలు కీలక పాత్రల్లో నటించారు. 70 ఏళ్ల వృద్దురాళికి యవ్వనం తిరిగి వస్తే ఎలాంటి పరిణామాలు జరిగాయి. ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్‌ను సైతం అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..