ఎర్లీమార్నింగ్ వెయిట్ లాస్ వాటర్ డ్రింక్స్ ...
- January 05, 2016
శరీరంలో ఫ్యాట్ సెల్స్ ను టార్గెట్ చేస్తే ప్రతి రోజూ ఉదయం ఆ ఫ్యాట్ సెల్స్ ను కరిగించి బరువు తగ్గించుకోవడం సులభమే. ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే బాడీ యొక్క మెటబాలిజం రేట్ అధికంగా ఉంటుంది. మరియు అదే సమయంలో ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవడానికి బాడీ కూడా రెడీగా ఉంటుంది. అందువల్ల, ఉదయం తీసుకొనే కొన్ని రకాల వాటర్ డ్రింక్స్ చాలా వేగంగా బరువు తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. అంతే కాదు ఎర్లీ మార్నింగ్ తీసుకొనే కొన్ని వాటర్ డ్రింక్స్ వల్ల శరీరంలో అధికబరువుకు మరియు ఇన్ఫ్లమేషన్ కు కారణమయ్యే టాక్సిన్స్ ను శరీరం నుండి ఫ్లష్ అవుట్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ వెయిట్ లాస్ డ్రింక్స్ ను ప్రతి రోజూ ఎర్లీమార్నింగ్ త్రాగడం వల్ల ఇవి శరీరం చాలా సులభంగా గ్రహిస్తుంది. దాంతో మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. వేగంగా బరువు తగ్గించుకోవడానికి పది సీక్రెట్స్ ..! ఎర్లీమార్నింగ్ వెయిట్ లాస్ వాటర్ డ్రింక్స్ ...వెయిట్ లాస్ కోసం తీసుకొనే పిల్స్ కంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి . మరియు ఈ వాటర్ డ్రింక్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . ఎర్లీమార్నింగ్ వాటర్ డ్రింక్స్ వల్ల బరువు తగ్గించుకోవడం మాత్రమే కాదు, అనేక రకాల హెల్త్ రిలేటెడ్ బెనిఫిట్స్ ను కూడా పొందివచ్చు. . ఇవి బాడీలో ఇమ్యూన్ పవర్ పెంచడంతో పాటు, హైబ్లడ్ ప్రెజర్ తగ్గించి నార్మల్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తాయి . బరువు తగ్గడానికి బేసిక్ అండ్ క్విక్ వెయిట్ లాస్ టిప్స్ మరి మీరు వేగంగా ఒక నెలలో బరువు తగ్గించుకోవడానికి హెల్ప్ అయ్యే ఎర్లీమార్నింగ్ వెయిట్ లాస్ డ్రింక్స్ ఏంటి? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం ఒక గ్లాసు లెమన్ వాటర్ లో కేయాన్ పెప్పర్ ను ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసి, ఉదయం పరగడుపున త్రాగాలి. ఈ డ్రింక్ తాగిన ఒక గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి. కేయాన్ పెప్పర్లో ఉండే క్యాప్ససిన్ మెటబాలిజం రేటును పెంచుతుంది. దాంతో బరువు తగ్గుతారు . అంతే కాదు బాడీ ఫ్యాట్ ను కూడా చాలా వేగంగా కరిగిస్తుంది మరియు లంగ్స్ లో టాక్సిన్స్ ను తొలగిస్తుంది. బాడీ ఇన్ఫ్లమేషన్ మరియు బరువును పెంచే టాక్సిన్స్ ను శరీరం నుండి తొలగించడానికి జింజర్ వాటర్ గ్రేట్ గా సహాయపడుతాయి . ఈ వాటర్ మెటబాలిజం రేట్ ను పెంచుతుంది మరియు డే టైమ్ లో బాడీ ఫ్యాట్ కరగడానికి సహాయపడుతుంది . అల్లం తురిమి, గ్లాసు నీటిలో వేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం పరగడుపుతో ఈ నీటిని త్రాగాలి. ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా పసుపు మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం పరగడపున త్రాగాలి .ఇలా త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ మరియు బాడీ ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది . పసుపు ఇన్ఫెక్షన్స్ ను తగ్గించి బాడీని స్లిమ్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బరువు తగ్గించుకోవడంలో లెమన్ వాటర్ గ్రేట్ . ఎఫెక్టివ్ హోం రెమెడీ. గోరువెచ్చని లెమన్ వాటర్లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ఎర్లీమార్నింగ్ పరగడుపుతో తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు. లెమన్ వాటర్ త్రాగిన 1గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేయాలి. ఈ ఎర్లీ మార్నింగ్ డ్రింక్ మిమ్మల్ని స్లిమ్ గా మార్చడంతో మాత్రమే కాదు బెల్లీఫ్యాట్ ను కరిగిస్తుంది. ఒక చెంచా ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ కు అరగంట ముందు త్రాగాలి. ఇది బరువు తగ్గించడం మాత్రమే కాదు, రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతుంది . ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ మరియు కడుపుబ్బరానికి కారణం అయ్యే ఆహారాలు తీసుకోకుండా మంచి ఆహారాలను తీసుకోవాలి. మన శరీరంలోని టాక్సిన్స్ మెరిక్యురీని తొలగించడానికి మరియు బాడీ సెల్స్ రిపేర్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది బాడీ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక చెంచా క్లోరెల్లాను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయాన్నే పరగడుపుతో తాగాలి. క్లోరెల్లా చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ బెన్టోనైట్ క్లే ను మిక్స్ చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ నీటిని మరుసటి రోజూ ఉదయం పరగడుపు త్రాగాలి. గ్లాసులో అడుగు బాగంలో మట్టి పేరుకుని ఉంటుంది. దాన్ని అలాగే ఉంచేయాలి. బెంటోనైట్ క్లే శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా గ్రహించి తర్వాత స్టూల్ ద్వారా బయటకు విసర్జింపుటకు సహాయపడుతుంది . ఈ వాటర్ వల్ల ఇన్ఫ్లమేసన్ మరియు బరువు తగ్గించుకోవచ్చు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









