జర్నలిస్టులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కంగనా
- July 11, 2019
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానలా మారింది. రనౌత్ కు, జర్నలిస్టులకు మధ్య ఏర్పడిన వివాదం ముదురుతోంది. ఈ నెల 7వ తేదీన తన తాజా చిత్రం 'మెంటల్ హై క్యా' చిత్రానికి సంబంధించి కార్యక్రమంలో కంగన మాట్లాడుతూ, 'మణికర్ణిక' చిత్రం గురించి నీచంగా రాశారంటూ ఓ జర్నలిస్టును దుర్భాషలాడారు. దీంతో కంగన బహింరంగ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పేవరకు ఆమెకు మీడియా కవరేజ్ చేయమని 'ఎంటర్ టైన్ మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' ప్రకటించింది. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాత ఏక్తా కపూర్ జర్నలిస్టులకు క్షమాపణ చెప్పింది. కంగానా మాత్రం క్షమాపణ చెప్పలేదు. అంతేకాదు, మీడియాను దుర్భాషలాడుతూ వీడియోను విడుదల చేసింది.
ఫ్రీగా భోంచేసేందుకు ప్రెస్ మీట్లకు వస్తున్నారు. మిమ్మల్ని జర్నలిస్టులని ఏ ఆధారంతో పిలవాలి? నన్ను బ్యాన్ చేయమని చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఎందుకంటే నా పేరు చెప్పుకుని మీరు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు. మీలాంటి సూడో జర్నలిస్టులు నా స్టేటస్ ను దెబ్బతీయగలరా?' అని వీడియోలో కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..