"డియర్ కామ్రేడ్ " ట్రైలర్
- July 11, 2019
టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం, టాక్సీవాలా ఇలా వరుస విజయాలతో స్టార్ హీరో రేంజ్ కి ఎదిగిపోయాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత మంచి సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. మరోసారి ఈ జంట తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా 'డీయర్ కామ్రెడ్'రూపొందుతుంది.
ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ మూవీ నిర్మిస్తోంది. ఈ సినిమా క్రీడా నేపథ్యం ఉన్న సినిమాగా తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. గతంలో కూడా ఇదే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన లిరికల్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. 'నీ నీలి కన్నుల్లోని ఆకాశమే.. తెల్లారి అల్లేసింది నన్నే..' అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది.
విజయ్ దేవరకొండ ఇటీవల తన ట్విటర్‌లో.. ఈ పాటను ఇప్పటివరకు వందసార్లకు పైగా విన్నానని, ఇంకా వినాలపిస్తోందని అంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొత్తానికి ఈ మూవీ క్రికెట్ నేపథ్యంతో పాటు మంచి ప్రేమ కథా లా కనిపిస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







