`ఏ ఏ 19` టైటిల్‌పై చర్చ
- July 11, 2019




టాలీవుడ్‌లో గత ఏడాది వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ` నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అల్లు అర్జున్‌కు హిట్ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు తన పాత డైరెక్టర్ త్రివిక్రమ్‌తో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. గతంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో జులాయి, s/o సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త సినిమా `ఏ ఏ 19` షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
అయితే ఈ సినిమాతో త్రివిక్రమ్‌కు అల్లు అర్జున్ మూడో సారి ఛాన్స్ ఇచ్చినట్లైంది. వీరి ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా ఫాదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కనుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా టైటిల్‌పై సినీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అలాగే కొన్ని టైటిల్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటి నాన్న.. నేను - రెండోవది అలకనంద అనే టైటిల్స్ ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమా టైటిల్స్ విషయంలో త్రివిక్రమ్ కూడా చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నట్లు టాక్ వస్తోంది. అచ్చతెలుగు పేర్లు సినిమా టైటిల్స్ గా పెట్టడానికి మరింత ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వస్తున్న ఆ రెండు పేర్లపై మంచి టాక్ వచ్చింది. మరి ఫైనల్‌గా వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







