ప్రపంచకప్-2023 భారత్ లోనే

- July 16, 2019 , by Maagulf
ప్రపంచకప్-2023 భారత్ లోనే

ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా చూసిన ప్రపంచకప్ సమరం ఎట్టకేలకు ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులు ఆత్రుతగా చూసిన 2019 ప్రపంచకప్‌ను 44ఏళ్ల తర్వాత క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ ఎత్తుకెళ్లింది. ఇదిలా ఉంటే 2023 ప్రపంచకప్‌కు కూడా వేదికను సిద్ధం చేశారు నిర్వాహకులు. 2023 ప్రపంచ కప్‌కి గాను ఇండియా వేదికగా నిలుస్తుండగా.. షెడ్యుల్‌ను కూడా ఖరారు చేసింది.

2023 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మార్చ్ 26వ తేదీ వరకు వరల్డ్ కప్‌ని నిర్వహించనున్నారు. గతంలో భారత్ ప్రపంచ కప్‌కి మూడు సార్లు ఆతిధ్యం ఇచ్చింది. 1987, 1996, 2011లో ఆతిధ్యం ఇచ్చింది. అయితే పొరుగు దేశాల అయిన బంగ్లాదేశ్ , శ్రీలంకలతో కలిసి భారత్ ప్రపంచ కప్‌కి ఆతిధ్యం ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం ఒక్క భారత్ లోనే మొత్తం వరల్డ్ కప్‌ను నిర్విహించనున్నారు.

సెంటిమెంట్ ప్రకారం గత మూడు పర్యాయాలుగా ఎవరు ఆతిధ్యం ఇస్తే వాళ్లే కప్ గెలుస్తుండగా.. రాబోయే వరల్డ్ కప్ ఇండియా గెలుస్తుందా? అనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఐసీసీ నిభందలన ప్రకారం టాప్-8లో ఉండే జట్లు నేరుగా టోర్నీలో పాల్గొనే అవకాశం ఉండగా.. మిగిలిన రెండు స్థానాల కోసం 5జట్లు పోటి పడుతాయి.
కెరీర్ ఏదైనా ఓకే.. క్రీడలొద్దు : యువతకు నీషమ్ హితబోధ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com