ప్రభాస్ అభిమానులు ఇంకొన్ని రోజులు వేచిఉండక తప్పేట్టులేదు!
- July 17, 2019
'సాహో'కి లాస్ట్ మినిట్ టెన్షన్స్ తప్పడం లేదు. సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే... ఆ రోజున సినిమా విడుదల కాదట. ప్యాచ్ వర్క్ కొంత బాలన్స్ ఉందట. అలాగే, విఎఫ్ఎక్స్ పూర్తి కావడానికి టైమ్ పడుతుందట. అందుకని, పదిహేను రోజులు వాయిదా వేసి, ఆగస్టు 30న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. 'సాహో' వెనక్కి వెళ్లడంతో శర్వానంద్ 'రణరంగం', అడివి శేష్ 'ఎవరు' ఆగస్టు 15కి వచ్చాయి. ఉన్నట్టుండి రెండు సినిమాల విడుదల తేదీలు మంగళవారం ప్రకటించడంతో ప్రేక్షకుల్లో, పరిశ్రమలో 'సాహో'కి పోటీగా వస్తున్నారేంటి? అని చర్చ మొదలైంది. ఆరాలు తీయగా 'సాహో' వాయిదా పడుతుందని తెలిసి ఆగస్టు 15పై కర్చీఫ్ వేశారని తెలిసింది. సరైన విడుదల తేదీ కోసం ఎదురు చూస్తున్న శర్వానంద్ 'రణరంగం'కు మంచి డేట్ దొరికింది. అయితే... ప్రభాస్ అభిమానులకు మాత్రం వాయిదా నిర్ణయం మింగుడు పడటం లేదు. దర్శకుడు సుజీత్, యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..