నేటి నుంచి ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలు రద్దు
- July 17, 2019
సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే.. బ్రేక్ సమయాల్లో ఇచ్చే.. ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో చోటు చేసుకొన్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా వెల్లడించారు.
అలాగే. బ్రేక్ దర్శనాల్లో అమలు చేస్తున్న ఎల్-1, 2, 3 విధానంలో లోపాలను ఆసరా చేసుకొని పలు అక్రమాలకు పాల్పడ్డారని ఛైర్మన్ తెలిపారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడం ద్వారా సామాన్య భక్తుల దర్శనం సమయం మరింత పెంచుతామని కూడా వివరించారు. ఈరోజు నుంచే వాటిని రద్దు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సాంకేతిక పరమైన అంశాలను సరిచేసి మరో రెండు మూడు రోజుల్లో అధికారులు అమలు చేస్తారని కూడా సుబ్బారెడ్డి వివరించారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







