'పాడే ఉమారాణి' గారికి దుబాయ్ పోలీసుల సత్కారం
- January 06, 2016

వలసదారుల్లా అరబ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతున్న వారికి ఆపన్న హస్తం అందిస్తోన్న తెలుగు మహిళ పాడే ఉమారాణి గారి సేవల్ని గుర్తించిన దుబాయ్ పోలీసు ఉన్నతాధికారులు ఆమెను సత్కరించారు. దుబాయ్ పోలీసుల తరఫున ఉన్నతాధికారి మజీద్ అల్ సువేదీ ఉమారాణిని సత్కరించి, ఆమె సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని అందించారు. దుబాయ్లో దుర్భర జీవితం గడుపుతున్న తెలుగు పేదలకు చాలా సందర్భాల్లో దుబాయ్ పోలీసులు అండగా నిలిచారనీ, ఓ మహిళగా అక్కడ బాధపడ్తున్నవారిని ఆదుకునేందుకు తనవంతు సహాయం చేస్తున్నానని ఈ సందర్భంగా ఉమారాణి గారు చెప్పారు. ఉషారాణి పాడే గారు సికింద్రాబాద్ నుంచి వెళ్ళి దుబాయ్లో స్థిరపడ్డారు. ఎవరు కష్టాల్లో ఉన్నా తక్షణం స్పందించే ఉమారాణి గారు, దుబాయ్లో తెలుగువారికి అందిస్తున్న సామాజిక సేవను అక్కడివారు కొనియాడుతున్నారు. అలాగే దేశం కాని దేశంలో మనవారిని ఆదుకుంటున్న ఉమారాణి గారికి స్వదేశంలోనూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మాగల్ఫ్.కామ్ టీం తరపున ఉమారాణి గారికి ప్రత్యేక అభినందనలు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







