సెకండ్ హ్యాండ్ షూ ధర.. రూ. 3కోట్లు
- July 24, 2019
1972లో ‘మూన్ షూ’ పేరుతో నైకీ సంస్థ తయారుచేసిన షూకు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఓ బూట్లు వేలంలో ఆ షూను ఆక్షన్ ఉంచగా ఏకంగా 4,37,500 డాలర్లు ధర పలికింది. మన కరెన్సీలో ఇది రూ. 3కోట్లకు పైమాటే. స్నీకర్స్‌ను సోథిబే అనే సంస్థ మంగళవారం వీటిని వేలం వేసింది. ఈ బూట్లను కెనడాకు చెందిన మైల్స్ నాదల్ అనే వ్యక్తి ఆన్‌లైన్ వేలం ద్వారా దక్కించుకున్నాడు. ఈ మూన్ షూను దక్కించుకోవడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నైకీ సహ వ్యవస్థాపకుడు బిల్ బోవర్‌మన్ 1972 ఒలింపిక్ ట్రయల్స్‌లో రన్నర్ల కోసం ఈ ‘మూన్ షూ’ను డిజైన్ చేశారు. కేవలం 12 జతలను మాత్రమే తయారు చేశారు. వాటిలో ఒక్కటైనా ఈ షూను సోథిబే తాజాగా వేలం వేసింది. ప్రస్తుతం వేలం సరికొత్త ప్రపంచ రికార్డు నమోదుచేసింది. 2017లో బాస్కెట్‌బాల్ ఆటగాడు మైఖెల్ జోర్డాన్ ధరించిన కాన్‌వర్స్ స్నీకర్స్‌ను కూడా సోథిబేనే వేలం వేసింది. ఈ షూను 1984 ఒలింపిక్ బాస్కెట్‌బాల్ ఫైనల్స్ సమయంలో మైఖెల్ థరించాడు. ఆ వేలంలో వాటి ధర 1,90,373 డాలర్లుగా పలికింది. ఇప్పటివనకు అదే హైయెస్ట్ రికార్డుగా ఉండగా తాజాగా నైకీ మూన్ షూ వేలంతో ఆ రికార్డు బద్దలైంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







