కిలిమంజారోని అధిరోహించనున్న 9 మంది షార్జా బాలికలు

- July 26, 2019 , by Maagulf
కిలిమంజారోని అధిరోహించనున్న 9 మంది షార్జా బాలికలు

 షార్జాకి చెందిన 9 మంది బాలికలు ప్రపంచంలోనే అత్యంత సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'వరల్డ్‌ మోస్ట్‌ డేరింగ్‌ మౌంటెయిన్‌ అడ్వెంచర్‌' ఆగస్ట్‌లో జరగనుంది. కాగా, రెండోసారి సజయా యంగ్‌ లేడీస్‌ ఆఫ్‌ షార్జా (ఎస్‌వైఎల్‌), మౌంటెనీరింగ్‌ ఎక్స్‌పెడిషన్‌ని నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోని అత్యున్నత శిఖరమైన మౌంటెయిన్‌ కిలిమంజారోని ఈసారి అధిరోహించనుంది బాలికల బృందం. శారీరకంగా దృఢంగా వుండడమే కాదు, మానసికంగానూ ధృఢంగా వుంటేనే ఈ సాహసం సాధ్యమవుతుంది. గత ఏడాది ఇదే సమయంలో తొలి గ్రూప్‌ ఎస్‌వైఎల్‌ క్లయింబర్స్‌ విజయవంతంగా అట్లాస్‌ రేంజ్‌లోని మౌంట్‌ టౌబ్కాల్‌ని అధిరోమించారు. కఠినతరమైన శిక్షణతోపాటు, చాలా జాగ్రత్తలు తీసుకోవడం ఇందులో అతి ముఖ్యమైన ప్రక్రియ. ఎస్‌వైఎల్‌ డైరెక్టర్‌ షేకా ఐషా ఖాలిద్‌ మాట్లాడుతూ, వన్‌ టు వన్‌ సెషన్స్‌ ఈ ట్రైనింగ్‌లో కీలకమని చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com