వేడి గాలులతో ఐరోపా భగ భగ...
- July 27, 2019
యూరోప్:వేడిగాలులతో ఐరోపా భగభగలాడుతోంది. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గత రికార్డులను బద్దలు కొడుతు న్నాయి. ముఖ్యంగా గురువారం నాడు జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ తదితర దేశాలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఆయా దేశాల వాతావరణ విభాగాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులతో భూమండలం క్రమంగా వేడెక్కుతోందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరించిన నెల రోజుల వ్యవధిలో అత్యధిక స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావటం ఇది రెండోసారి. సహారా ఎడారి ప్రాంతం నుండి ఉత్తర దిశగా వీస్తున్న వేడిగాలులు వాతావరణంలో తేమను ఆవిరి చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్, బ్రిటన్‌లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయన్నారు. వృద్ధులు ఇళ్లు వీడి బయటకు రావద్దని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు. నగరాల్లో చిన్నారులు వేసవి తాపాన్ని తట్టుకునేం దుకు వాటర్ ఫౌంటెయిన్ల వైపు పరుగులు తీస్తు న్నారు. పారిస్ నగరంలో గురువారం మధ్యాహ్నం 42.6 డిగ్రీల సెల్షియస్ నమోదయింది. 1947 జులైలో నమోదయిన 40.4 డిగ్రీల సెల్షియస్ ఇప్పటివరకు ఉన్న అత్యధిక ఉష్ణోగ్రత. ఇప్పుడీ ఉష్ణో గ్రతలు ఆ రికార్డును బద్దలుకొట్టాయి. రుతువులు గతి తప్పడం, అతి వృష్టి, అనావృస్టి, ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోవడానికి హరితగృహ వాయువులే కారణమని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..