దుబాయ్ - షార్జా ఫెర్రీ సర్వీస్ ప్రారంభం
- July 27, 2019
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ, దుబాయ్‌లోని అల్ ఘుబైబా మెరైన్ స్టేషన్ నుంచి షార్జాలోని అక్వేరియం మెరైన్ స్టేషన్ వరకు ఫెర్రీ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దుబాయ్ నుంచి ఇతర ఎమిరేట్స్‌కి తొలి మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏడాదికి 1.3 మిలియన్ ప్రయాణీకులకు సేవలు అందించేలా దీన్ని తీర్చిదిద్దారు. అవసరమైతే, దీనా స్థాయిని మరింత పెంచుతారు. సిల్వర్ క్లాస్‌లో 15 దిర్హామ్‌లు, గోల్డ్ క్లాస్‌లో 25 దిర్హామ్‌లకు ప్రయాణించేలా వీలు కల్పించారు. పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్ అలాగే ఐదేళ్ళ లోపు చిన్నారులకు ఇందులో ఉచిత ప్రయాణం అందిస్తుండడం గమనార్హం. ఫ్రీ వైఫై సర్వీస్ కూడా రైడర్స్‌కి అందిస్తారు. మెరైన్ ట్రాన్సిట్ సర్వీస్‌ని ఎంకసరరే/జ్ చేసే క్రమంలో 300 వాహనాలకు పార్క్ అండ్ రైడ్ సౌకర్యం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







