లెజండరీ క్రికెటర్ బయోపిక్ నిర్మాణంలో రానా
- July 30, 2019
శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్‌లో ముత్తయ్యగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి నిర్మించబోతున్నారు. థార్‌మోషన్ పిక్చర్స్‌తో సంయుక్తంగా సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు చిత్ర మేకర్స్ మంగళవారం ప్రకటించారు. విజయ్ సేతుపతి, దర్శకుడు రంగస్వామి, థార్ ప్రొడక్షన్‌తో కలిసి పనిచేయబోతుండడం ఉత్సాహంగా ఉందని రానా ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.
ఇక సురేశ్ ప్రొడక్షన్స్‌లో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఓ బేబీ’ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్‌లో ఎనిమిది వందల వికెట్లు తీసిన ఘనత మురళీధరన్ సొంతం. కాబట్టి ఈ సినిమాకు ‘800’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్ మాత్రం డిసెంబర్‌లో ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..