స్పీడింగ్ ఉల్లంఘనలు: పోలీసుల ప్రకటన సారాంశమిదీ..
- August 01, 2019
దుబాయ్:ట్రాఫిక్ జరీమానాల్ని ఉపసంహరించుకుంటున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై దుబాయ్ పోలీస్ స్పందించింది. అతి వేగంగా ప్రయాణించిన ఓ వాహనదారుడికి విధించబడిన జరీమానా నుంచి ఉపశమనం లభించిందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ దర్శనమిచ్చింది. దానిపై స్పందించిన దుబాయ్ పోలీస్ సెక్యూరిటీ మీడియా డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ ఫైసల్ ఇస్సా అల్ కాసిమ్, పదేళ్ళ క్రితం నాటి మెసేజ్‌గా దాన్ని కొట్టి పారేశారు. ఆ మెసేజ్‌లో వున్న దుబాయ్ పోలీస్ లోగో పాతదని తేల్చారాయన. సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి రూమర్స్‌ని ప్రచారం చేయడం తగదని కల్నల్ కాసిమ్ హెచ్చరించారు. ఇలాంటి విషయాలపై అధికారిక సమాచారాన్ని అధికారిక ఛానల్స్ ద్వారా మాత్రమే విడుదల చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







