ఆగస్ట్‌లో పెరగనున్న పెట్రోల్‌ ధరలు

- August 01, 2019 , by Maagulf
ఆగస్ట్‌లో పెరగనున్న పెట్రోల్‌ ధరలు

దోహా: ఖతార్‌లో పెట్రోల్‌ ధరలు ఆగస్ట్‌ నెల కోసం పెరగనున్నాయి. 5 నుంచి 15 దిర్హామ్‌ల వరకు ఈ పెరుగుదల వుంటుంది. ప్రీమియర్‌ గ్రేడ్‌ పెట్రోల్‌ ధర ఆగస్ట్‌లో 1.80 ఖతారీ రియాల్స్‌ వుంటుంది. జులైతో పోల్చితే 10 దిర్హామ్‌లు ఎక్కువ. సూపర్‌ పెట్రోల్‌ 1.90 ఖతారీ రియాల్స్‌గా మారనుంది. జులైలో ఈ ధర 1.75 ఖతారీ రియాల్స్‌గా వుంది. డీజిల్‌ ధర 1.90 దిర్హాహ్‌లకు చేరుకుంటుంది. జులైతో పోల్చితే 5 దిర్హామ్‌లు ఇందులో పెరుగుదల నమోదయ్యింది. జూన్‌లో పెట్రోల్‌ ధరల్ని ఖతార్‌ పెట్రోలియం పెంచలేదు. కానీ, మేలో మాత్రం 15 దిర్హామ్‌ల వరకు పెరిగింది. ఏప్రిల్‌లో 25 దిర్హామ్‌ల వరకు పెరగగా, మార్చిలో 5 దిర్హామ్‌లు పెరిగింది. ఫిబ్రవరిలో ధరలు పెరగలేదు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com