13 ఏళ్ళ బాలిక బలవన్మరణం
- August 01, 2019
యూఏఈలో 13 ఏళ్ళ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మృతురాల్ని గల్ఫ్ జాతీయురాలిగా గుర్తించారు. షార్జాలోని అల్ రమ్తా ఏరియాలోని తన ఇంట్లో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతూ ఆమె మరణించింది. బాలికను రక్షించేందుకు చాలా శ్రమించామనీ, ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు వైద్యులు. బ్లాక్ స్కార్ఫ్‌ని మెడకు చుట్టుకుని, బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు పోలీసులు. బాలిక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తొలుత కనుగొన్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్య చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిందామె. మృతదేహంపై వేరే ఎలాంటి గాయాలూ లేవని వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







