ఐఐఎఫ్ సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం..
- January 06, 2016
పారిస్‌లో ఈ నెల 18న జరిగే ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్ 2016 (ఐఐఎఫ్) సదస్సుకు హాజరు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరై కీనోట్ అడ్రస్ ఇవ్వాలని మంత్రిని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్రాన్స్-ఇండియా (సీసీఐఎఫ్‌ఐ) కోరింది. ఈ మేరకు సీసీఐఎఫ్‌ఐ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసింది. ఈ సమావేశంలో 'ఇన్వెస్ట్‌మెంట్ అండ్ న్యూ గ్రోత్ డ్రైవర్స్' అనే అంశంపై మంత్రి కేటీఆర్ ప్రసంగించాలని సీసీఐఎఫ్‌ఐ చైర్మన్ డాన్ ఓక్నినే కోరారు.భారత్, ఫ్రాన్స్‌తోపాటు యూరోపియన్ యూనియన్‌లోని ఫ్రెంచ్ మాట్లాడే దేశాల మధ్య సంబంధాల అభివృద్ధి కోసం ఫోరం పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ సదస్సుకు కేటీఆర్ హాజరై భారత దేశ బ్రాండ్ ఇమేజ్‌ను ఫ్రెంచ్ దేశాలకు పరిచ యం చేయాలని, రాష్ట్రంలో అభివృద్ధి అవకాశాలను వివరించాలని కోరారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాల్లో పబ్లిక్-ప్రైవేటు, ప్రైవేటు-ప్రైవేటు వాణిజ్య సంబంధాల్లో ఉన్న అవకాశాలను ఈ సమావేశం చర్చిస్తుందని, ఇరు దేశాల్లోని పారిశ్రామిక అవకాశాలను పరస్పరం తెలియజేసేందుకు ఇది ఉపకరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







