'మన్మథుడు 2' ప్రీ రిలీజ్ వేడుక
- August 04, 2019
హైదరాబాద్: 'మన్మథుడు 2' సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించిన ఈ వేడుకకు నటీనటులు నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, సీనియర్ నటి లక్ష్మి, అమల, వెన్నెల కిషోర్, వెన్నెల కిషోర్ తదితరులు హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించారు.ఆగస్టు నెల అంటే తనకు చాలా ఇష్టమని, ఇటీవలే 'బిగ్ బాస్' ప్రారంభమైందని, మన్మథుడు2 చిత్రం రిలీజ్ కాబోతోందని అన్నారు. ఇంకా ప్రేమకథా చిత్రంలో నటించడమేంటని చాలా మంది తనను అడిగారని, ఏ వయసులో నైనా ప్రేమించ వచ్చని చెప్పే ఫ్రెంచ్ కథ ఇది అని అన్నారు. ఈ చిత్రంలో తన సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ గురించి నాగార్జున మాట్లాడుతూ, ఆమె గొప్ప నటి, ఆరోగ్యం గురించి ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చని చెప్పారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







