పాక్ జర్నలిస్ట్‌పై కేసు వేసిన ఇమ్రాన్ ఖాన్..?
- August 05, 2019
పాకిస్తాన్ ప్రముఖ జర్నలిస్ట్, టీవీ యాంకర్‌పై ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశారని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేశారు. జర్నలిస్ట్ నజామ్ సైథీపై.. ఇమ్రాన్ ఖాన్ దాదాపు రూ.1000 కోట్ల దాకా పరువునష్టం కేసు వేశారు. ఈ మేరకు.. ప్రధాని తరపు న్యాయవాది బాబర్ అవాన్.. జర్నలిస్ట్ నజామ్ సైథీకి కోర్టు నోటీసులు పంపారు. కాగా.. దీనిపై పాకిస్తాన్ ప్రజా సంబంధాల ముఖ్య అధికారి అస్ఘర్ లెఘరి మాట్లాడుతూ.. ప్రధాని ఇమ్రాన్ వ్యక్తిగత జీవితం గురించి జర్నలిస్ట్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని.. నీతి నియమాలను ఉల్లంఘించి మరీ ప్రధానిపై ఆరోపించినందుకు నోటీసులు పంపారని పేర్కొన్నారు. ఎలాగైనా ప్రధాని ఇమ్రాన్‌కు వెయ్యి కోట్లు పంపించాలని లేని పక్షంలో జైలు శిక్ష అనుభవించక తప్పదని జర్నలిస్ట్ నిజామ్ సేథీని హెచ్చరించారు అస్ఘర్ లెఘరి.
తాజా వార్తలు
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్







