అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంకచోప్రా
- January 06, 2016
హాలీవుడ్ టీవీ సిరీస్ క్వాంటికోతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న ప్రియాంకచోప్రా మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే ఈ టీవీ సిరీస్ అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ షోగా రికార్డ్ సృష్టిస్తుండగా, అందులో లీడ్ రోల్ లో నటించిన ప్రియాంక నటనను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్వాంటికో టీవీ సిరీస్ తో మరోసారి వార్తల్లో నిలిచింది ప్రియాంక. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ 2016కు ప్రియాంక చోప్రా ఎంపికైంది.ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా నిర్వహించే ఈ కాంపిటీషన్ లో హాలీవుడ్ స్టార్స్ ఎమ్మా రోబర్ట్స్, లీ మిచెల్, మార్షియాగే హార్డన్ లాంటి స్టార్స్ ను వెనక్కి నెట్టి ప్రియాంక అవార్డ్ దక్కించుకుంది.ముఖ్యంగా హిందీలో సక్సెస్ ఫుల్ సినిమాలతో ఆకట్టుకోవటంతో పాటు, ప్రియాంక నటించిన క్వాంటికో హాలీవుడ్ లో ఘనవిజయం సాధించటంతో ఈ హాట్ బ్యూటీని పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ వరించింది. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియాంక. అవార్డుతో తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ తనకు ఓటు చేసినవారికి కృతజ్ఞతలు తెలియజేసింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







