సుష్మాస్వరాజ్ మృతిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఉద్విగ్నభరిత ట్వీట్
- August 07, 2019
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ తీవ్ర గుండెపోటుతో నిన్న ఎయిమ్స్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే సుష్మాస్వరాజ్ మృతిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుష్మను ప్రేమగా దీదీ అని పిలిచే స్మృతి.. ట్విటర్ వేదికగా ఉద్విగ్నభరిత సందేశాన్ని పోస్టు చేశారు. "నాకు నీతో గొడవ పెట్టుకోవాలని ఉంది దీదీ(సుష్మను ఉద్దేశిస్తూ). బన్సూరీ(సుష్మ కుమార్తె)తో కలిసి నన్ను రెస్టరెంట్‌కు తీసుకెళ్తానని మాటిచ్చావు. ఆ ప్రామిస్‌ను నెరవేర్చకుండానే నువ్వు వెళ్లిపోయావు" అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు. కాగా గత ప్రభుత్వంలో సుష్మ, స్మృతి కేబినెట్ మంత్రులుగా పనిచేశారు. అంతకు ఎంతో కాలం ముందు నుంచే సుష్మా, స్మృతిలు మంచి స్నేహితులు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!