మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- September 20, 2025
మనామా: 30 ఏళ్ల మహిళకు బహ్రెయిన్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు హై క్రిమినల్ కోర్టు ఆమెకు 5 వేల బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించింది. ఇదే సమయంలో మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్న తొమ్మిది మంది వ్యక్తులకు ఒక్కొక్కరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి వెయ్యి బహ్రెయిన్ దినార్ల చొప్పు జరిమానా విధించింది. పునరావాస కేంద్రం నుండి విడుదలైన తర్వాత సదరు మహిళ మాదకద్రవ్యాల పంపిణీని తిరిగి ప్రారంభించిందని, యాంటీ-నార్కోటిక్స్ విభాగానికి అందిన నిఘా సమాచారం మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆమె తన అపార్ట్మెంట్ నుంచి మాదకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







