శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్
- August 09, 2019
హైదరాబాద్: కశ్మీర్‌పై నిర్ణయం తర్వాత ఉగ్రదాడులు జరగొచ్చంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కశ్మీర్‌పై నిర్ణయం తర్వాత సామాన్య ప్రజలే లక్ష్యంగా దాడులు చేసేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్ధమయ్యాయని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ హెచ్చరికలతోపాటు, స్వాతంత్య్ర దినోత్సవం కూడా సమీపిస్తుండటంతో పోలీసులు రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







