దుబాయ్ ఫాంట్‌ని రూపొందించనున్న మైక్రోసాఫ్ట్
- January 07, 2016
దుబాయ్ పేరు మీద ఎలక్ట్రానిక్ పాంట్స్ ప్యాకేజీని డిజైన్ చేసే అంశంపై దృష్టి పెట్టాలని జనరల్ సెక్రెటేరియట్ ఆఫ్ ది కౌన్సిల్‌కి ఆదేశాలు జారీ చేశారు దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు, దుబాయ్ ఎకగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. డిజిటల్ ప్రపంచంలో దుబాయ్ తనదైన ప్రత్యేకతను చాటుకునేలా దుబాయ్ ఫాంట్స్ రూపకల్పన కోసం సమాయత్తమవుతున్నట్లు చెప్పరాయన. షేక్ హమదాన్ సూచనలతో సెక్రెటరీ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అబ్దుల్లా అల్ షాయిబాని, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళతో అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ దుబాయ్ ఫాంట్ రూపకల్పనలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహాయ సహారాలు అందించనుంది. 2021 నాటికి ప్రపంచంలోనే దుబాయ్‌ని మోస్ట్ ఇన్నోవేటివ్ అండ్ డిస్టింక్టివ్ నేషన్‌గా మార్చాలన్న మిషన్‌తో టెక్నాలజీ విభాగంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







